Honey trap

Honey Trap: టీ కోసం ఇంటికి పిలిచి..బట్టలిప్పి టెంప్ట్ చేసి..హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!

Honey Trap: బెంగళూరులో హనీట్రాప్ ఘటన సంచలనం రేపుతోంది. శృంగారం ఆశ చూపి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీగా దోచేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. పోలీసుల పేరుతో మారువేషంలో హనీట్రాప్‌కు పాల్పడుతున్న  నలుగురు నిందితులను బ్యాడరహళ్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్, అజయ్‌, జయరాజ్‌ అనే యువకులతోపాటు ఒక యువతి నయనను అరెస్ట్ చేశారు.

ఇటీవల ఓ కాంట్రాక్టర్‌కు కావాలనే దగ్గరై నయన.. సన్నిహితంగా ఉంటూ కొంతకాలం నమ్మించింది. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా అతడితో చనువుగా ఉంటూ కాజేసింది. ఈ క్రమంలోనే అతని గురించి పూర్తి కూపీ లాగిన నయన టీమ్ భారీగా దోచేయాలనే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కాట్రాంక్టర్ ను టీ కోసం ఇంటికి పిలిపించి అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Kushaiguda: భార్య కడుపుపై కూర్చొని.. ఊపిరాడకుండా చేసి.. గర్భిణిని హతమార్చిన భర్త

నయన మీద మోజుతో కాంట్రాక్టర్ ఆమె ఇంటికి వెళ్లిన కాసేపటికే పోలీసుల వేషంలో ముఠా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. తాము అడిగినంత ఇవ్వాలని, లేదంటే కఠిన శిక్షలు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో వెంటనే దగ్గరున్న రూ.55వేలు ఇచ్చేయగా.. కాంట్రాక్టర్ మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, బ్రాస్‌లెట్ కూడా బలవంతంగా లాక్కున్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ఇది సమరం కాదు..దేవర సంబరం...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *