Kiran Abbavaram: ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్యగోరఖ్ కలిసి 2019లో రాజావారు రాణిగారు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ గత యేడాది ఆగస్ట్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం మూవీ క ప్రొడక్షన్ వ్యవహారాలను రహస్య చూసుకోగా, ఆ చిత్రంతో చక్కని విజయాన్ని అందుకున్నారు కిరణ్ అబ్బవరం. అయితే తాజాగా ఈ జంట ఓ శుభవార్తను తెలియచేసింది. రహస్య ప్రస్తుతం గర్భవతి అని, త్వరలోనే ఆమె తల్లి కాబోతోందని తెలుపుతూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు.
View this post on Instagram