Bank Of Baroda

Bank Of Baroda: సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియం అకౌంట్.. ఇంటి వధకే బ్యాంకింగ్ సేవలు..!

Bank Of Baroda: సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రీమియం అకౌంట్లను తీసుకొచ్చింది. ఏప్రిల్ 2026లో సీనియర్ సిటిజన్ల కోసం ‘bob సీనియర్ సిటిజన్ విశేష్ సమ్మాన్’ (bob Senior Citizen Vishesh Samman) అనే ప్రత్యేక ప్రీమియం సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఈ అకౌంట్ 60 ఏళ్ల నుండి అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వీరి వయస్సుని దృష్టిలో పెట్టుకొని చాలానే ఫీచర్స్ తీసుకొచ్చింది. మెడిసిన్స్ పైన రాయితీ, ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు.. ఇలా చాలా ఫీచర్లతో ఈ అకౌంట్ ని తీసుకొచ్చింది. ఈ ఖాతాని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు: ఈ ఖాతాదారులు ఉచిత ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లు, మందులు ఇంకా డయాగ్నోస్టిక్ సేవలపై రాయితీలను పొందుతారు.

ఉచిత డోర్‌స్టెప్ బ్యాంకింగ్: నెలకు రెండుసార్లు ఇంటివద్దకే ఉచిత డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు.

డెబిట్ కార్డ్: ‘bob భూమి రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్’ (bob Bhoomi RuPay Select Debit Card) లభిస్తుంది, ఇది లైఫ్‌స్టైల్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్డుతో కస్టమర్లకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఉచిత ఆరోగ్య పరీక్షలు, జిమ్, స్పా, సెలూన్ సేవలు, గోల్ఫ్, ఇంకా OTT సబ్‌స్క్రిప్షన్‌ల వంటి ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది.

రివర్స్ మార్ట్‌గేజ్ లోన్: రివర్స్ మార్ట్‌గేజ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఛార్జీలలో 50% మినహాయింపు ఉంటుంది. అలాగే లాకర్ ఛార్జీలపై 20% తగ్గింపు, ఇంకా ఉచిత NEFT మరియు RTGS లావాదేవీలను కూడా పొందుతారు. IMPS లావాదేవీలపై కూడా 50% వరకు తగ్గింపు అందించబడుతుంది.

కనీస నిల్వ (MAB): ఈ అకౌంట్‌లో రూ. 1 లక్ష సగటు నెలవారీ బ్యాలెన్స్ (MAB) నిర్వహించాలి.

ముఖ్య గమనిక: నెలవారీ సగటు నిల్వ (MAB) నిర్వహించకపోతే, షార్ట్‌ఫాల్‌లో 6% (కనీసం ₹50.00 నుండి గరిష్టంగా ₹500.00) ఛార్జీలు వర్తిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *