Bank Holidays

Bank Holidays: జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఆర్బీఐ అధికారిక జాబితా విడుదల..!

Bank Holidays: జూలై నెలలో మీకు ఏవైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు లేదా బ్యాంకు పనులు ఉంటే, ఇప్పుడే ఒక లుక్ వేసి ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం, రాబోయే జూలై (2026) లో వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు శని, ఆదివారాలతో కలుపుకుని దాదాపు 12 రోజుల పాటు మూతపడనున్నాయి. అయితే, ఈ 12 రోజుల సెలవులు దేశవ్యాప్తంగా ఒకేసారి ఉండవని, ఆయా రాష్ట్రాల పండుగలు, స్థానిక సంస్కృతిని బట్టి మారుతుంటాయని వినియోగదారులు గమనించాలి.

సెలవుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

దేశవ్యాప్త సాధారణ సెలవులు (ఆరు రోజులు):

నెలలోని ఆదివారాలు, రెండవ ఇంకా నాల్గవ శనివారాల కారణంగా దేశంలోని అన్ని బ్యాంకు శాఖలకు ఈ క్రింది తేదీల్లో సాధారణ సెలవు ఉంటుంది.

  • జూలై 5: ఆదివారం సెలవు

  • జూలై 11: రెండవ శనివారం

  • జూలై 12: ఆదివారం సెలవు

  • జూలై 19: ఆదివారం సెలవు

  • జూలై 25: నాల్గవ శనివారం

  • జూలై 26: ఆదివారం సెలవు

ప్రాంతీయ పండుగలు – స్థానిక సెలవులు:

వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రత్యేక పండుగల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంచనున్నారు.

  • జూలై 6 (సోమవారం): MHIP దినోత్సవం సందర్భంగా మిజోరం (ఐజ్వాల్) లో బ్యాంకులకు సెలవు.

  • జూలై 9 (గురువారం): పెహ్టియన్‌ఖ్లామ్ పండుగ కారణంగా మేఘాలయ (షిల్లాంగ్) లో బ్యాంకులు పనిచేయవు.

  • జూలై 16 (గురువారం): జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ఒడిశా (భువనేశ్వర్) లో బ్యాంకులకు హాలిడే.

  • జూలై 18 (శనివారం): డ్రుక్పా సే-సే ఉత్సవాల కారణంగా సిక్కిం (గాంగ్‌టక్) లో బ్యాంకులు మూసి ఉంటాయి.

  • జూలై 21, 22: కర్చీ పూజ పండుగ నేపథ్యంలో త్రిపుర, మేఘాలయ పరిధిలో బ్యాంకులకు వరుస సెలవులు.

  • జూలై 31 (శుక్రవారం): అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ స్మారక దినోత్సవం సందర్భంగా హర్యానాలో బ్యాంకులు మూసి ఉంటాయి.

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకం:

బ్యాంకు శాఖలు ఆఫ్‌లైన్ పనుల కోసం మూసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు డిజిటల్ సేవల ద్వారా ఎలాంటి అంతరాయం కలగదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పంపడం, అకౌంట్ స్టేట్‌మెంట్లు చూసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు సులభంగా నిర్వహించుకోవచ్చు. దైనందిన చెల్లింపుల కోసం యూపీఐ (UPI) సేవలు, అత్యవసర నగదు అవసరాల కోసం ఏటీఎం (ATM) లు యథావిధిగా రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *