Balapur Ganesh History

Balapur Ganesh History: బాలాపూర్ లడ్డూకు 31 ఏళ్ల చరిత్ర.. ఈసారి రూ.35 లక్షల మార్క్ దాటుతుందా?

Balapur Ganesh History: హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట. గత 31 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ వేలం సంప్రదాయం ప్రతి ఏటా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. 21 కిలోల ఈ పవిత్ర లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని, సర్వశుభాలు కలుగుతాయని భక్తుల బలమైన విశ్వాసం. బాలాపూర్ లడ్డూ వేలం ముగిసిన తర్వాతే భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర లాంఛనంగా ప్రారంభం కావడం ఇక్కడి విశేషం.

రూ.450 నుంచి మొదలైన ప్రస్థానం..

  • 1994లో తొలి అడుగు
    బాలాపూర్ గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఎప్పటినుంచో జరుగుతున్నా, లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ఆ ఏడాది స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి కేవలం రూ. 450కే మొదటిసారి లడ్డూను దక్కించుకున్నారు.

ఆ లడ్డూను గ్రామస్థులకు ప్రసాదంగా పంచి, కొంత భాగాన్ని తన వ్యవసాయ పొలంలో చల్లగా ఆ ఏడాది ఊహించని రీతిలో భారీ పంట దిగుబడి వచ్చింది. దీంతో ఈ లడ్డూకు విశేషమైన మహిమ ఉందన్న నమ్మకం ఏర్పడి, ఏటేటా పోటీ విపరీతంగా పెరిగింది.

  • 2002లో లక్ష దాటిన ధర
    మొదట్లో వేలల్లో సాగిన బిడ్డింగ్.. 2002లో కందాడ మాధవరెడ్డి రూ. 1.05 లక్షలకు పాడటంతో తొలిసారి లక్షల మార్కును తాకింది

    2023లో దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు, 2024లో కొలను శంకర్ రెడ్డి రూ. 30.01 లక్షలకు దక్కించుకోగా.. 2025లో లింగాల దశరథ్ గౌడ్ ఏకంగా రూ. 35 లక్షల భారీ మొత్తానికి బిడ్ చేసి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పారు.

1994 నుంచి 2025 వరకు విజేతల పూర్తి వివరాలు..

సంవత్సరం దక్కించుకున్న విజేత పేరు పలికిన ధర (రూపాయల్లో)
1994 కొలను మోహన్‌రెడ్డి ₹450
1995 కొలను మోహన్‌రెడ్డి ₹4,500
1996 కొలను కృష్ణారెడ్డి ₹18,000
1997 కొలను కృష్ణారెడ్డి ₹28,000
1998 కొలను మోహన్‌రెడ్డి ₹51,000
1999 కళ్లెం ప్రతాప్‌రెడ్డి ₹65,000
2000 కొలను అంజిరెడ్డి ₹66,000
2001 జి. రఘునందన్‌చారి ₹85,000
2002 కందాడ మాధవరెడ్డి ₹1.05 లక్షలు
2003 చిగిరింత బాల్‌రెడ్డి ₹1.55 లక్షలు
2004 కొలను మోహన్‌రెడ్డి ₹2.01 లక్షలు
2005 ఇబ్రహీం శేఖర్ ₹2.08 లక్షలు
2006 చిగిరింత తిరుపతిరెడ్డి ₹3.00 లక్షలు
2007 జి. రఘునందన్‌చారి ₹4.15 లక్షలు
2008 కొలను మోహన్‌రెడ్డి ₹5.07 లక్షలు
2009 సరిత ₹5.10 లక్షలు
2010 కొడాలి శ్రీధర్‌బాబు ₹5.35 లక్షలు
2011 కొలను బ్రదర్స్ ₹5.45 లక్షలు
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి ₹7.50 లక్షలు
2013 తీగల కృష్ణారెడ్డి ₹9.26 లక్షలు
2014 సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి ₹9.50 లక్షలు
2015 కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి ₹10.32 లక్షలు
2016 కందాడి స్కైలాబ్‌రెడ్డి ₹14.65 లక్షలు
2017 నాగం తిరుపతిరెడ్డి ₹15.60 లక్షలు
2018 తేరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా ₹16.60 లక్షలు
2019 కొలను రాంరెడ్డి ₹17.60 లక్షలు
2020 కరోనా మహమ్మారి కారణంగా వేలం నిర్వహించలేదు —
2021 మర్రి శశాంక్‌రెడ్డి & రమేష్‌యాదవ్ ₹18.90 లక్షలు
2022 వంగేటి లక్ష్మారెడ్డి ₹24.60 లక్షలు
2023 దాసరి దయానంద్‌రెడ్డి ₹27.00 లక్షలు
2024 కొలను శంకర్‌రెడ్డి ₹30.01 లక్షలు
2025 లింగాల దశరథ్‌గౌడ్ ₹35.00 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *