Sailajanath Toung Twist: ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా వైభవోపేతంగా పునర్నిర్మాణ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంది ఆంధ్రరాష్ట్ర కలల రాజధాని అమరావతి. మూడు సంవత్సరాల్లో రాజధాని పనులన్నీ నభూతో న భవిష్యత్ అనే విధంగా నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ.. అమరావతికి కచ్చితంగా కేంద్రం సపోర్టు ఉంటుందని లక్షలాది మంది ప్రజలు సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ స్వాగతిస్తున్నారు అమరావతి రాజధాని పునర్నిర్మాణాన్ని. అయితే ఒక్క వైసీపీ మాత్రమే రాజకీయం చేస్తూ ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక వైసీపీ కండువా కప్పుకోగానే, ఉన్మాదం పూనినట్లుగా, దశాబ్దాలుగా సంపాదించుకున్న గుడ్ విల్‌కి కూడా నీళ్లు వదిలేసి, గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా మరిచిపోయి, వైసీపీ అజెండా భుజాలకెత్తుకుని, రాజధాని నిర్మాణానికి తూట్లు పొడిచే విధంగా, అమరావతి అంతానికి పంతం పట్టినట్లు మాట్లాడుతున్నారు సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి సాకే శైలజనాథ్.
రాజకీయ పార్టీలు తమ వాయిస్ వినిపించడం, ప్రజల పక్షాన ప్రతిపక్షం హోదాలో మాట్లాడడం తప్పులేదు. కానీ సీనియర్ పొలిటిషియన్, మాజీ కాంగ్రెస్ మంత్రి, తాజా వైసీపీ నేత శైలజనాథ్ కండువా మార్చినంతనే ఆయన మాటల్లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటివరకు.. అంటే 2019 నుంచి 2024 వరకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో.. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై కుట్ర చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు శైలజనాథ్. ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడోసారి గుర్తు చేసుకుంటే, ఈ నాయకుడేనా ఆ మాటలు మాట్లాడింది అనే విధంగా బిత్తరపోతారు ప్రజలు. రాజకీయ ఉనికి కోసం మరీ ఇంతలా వేషం మార్చాలా అంటూ ఆశ్చర్యపోతున్నారు పరిశీలకులు.
2024 ఎన్నికల వరకు.. కాంగ్రెస్ పార్టీ తరఫున.. సింగనమల నియోజకవర్గంపై మూడు సార్లు దండయాత్ర చేసినా ఫలితం లేకుండా పోయింది. మూడుసార్లు ఓటమే వరించింది. అంతే, ఇక కాంగ్రెస్‌లో గెలవలేము అనుకున్నారో ఏమో తెలీదు గానీ, తల్లి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పి, పిల్ల కాంగ్రెస్ కండువా మెడలో వేసుకున్నారు!!! శైలజనాథ్ సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఇది వరకు ఆయన మీడియా సమావేశాల్లో విలువలతో కూడిన ప్రజెంటేషన్ ఉండేది. వైసీపీ కండువా ధరించారో లేదో.. జగన్ముఖిలా కొత్త అవతారమెత్తారు.
Also Read: Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్‌పై గర్జించిన పవన్ కల్యాణ్
Sailajanath Toung Twist: సహజాంగానే వైసీపీలో బండి నడవాలంటే జగన్‌ని మెప్పించేందుకు ఎన్ని బూతులైనా మాట్లాడాల్సిందే… సొంత అభిప్రాయాలకు, ఆలోచనలకు స్వస్తి పలికి తాడేపల్లి స్క్రిప్ట్‌ను మోయాల్సిందే… అన్న విమర్శ ఉంది. కానీ శైలజానాథ్ లాంటి గుడ్‌విల్, సీనియారిటీ ఉన్న నేత సైతం ఇంత త్వరగా వైసీపీ లైన్‌ని అందుకోవడం అంటేనే కొంత ఆశ్చర్యం కలుగుతోంది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీలో చేరిన తర్వాత మొన్నటివరకు కూడా ఆయనకు సింగనమల ఇంచార్జ్ పోస్టు ఇస్తారా లేదా అన్న స్పష్టత లేదు. శైలజానాథ్‌ను జగన్ వేరే నియోజకవర్గానికి పొమ్మంటున్నారంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. అమరావతిపైన, అధికార టీడీపీపైన ఆయన మాటలతో విరుచుకుపడడానికి చాలా కారణాలే ఉన్నాయంట.
సాకే శైలజనాథ్ రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికే పరిమితమయ్యారనీ, జగన్‌ని మెప్పించి సింగనమల ఇంచార్జ్ బాధ్యతలు తెచ్చుకోవడానికే అమరావతిపైన ఎదురుదాడికి దిగారన్న వాదన వినిపిస్తోంది. వైసిపిలో చేరిన మొదటి రెండు వారాలు యాక్టివ్‌గా ఉన్న శైలజనాథ్, ఒక్కసారిగా మధ్యలో సైలెంట్ అయిపోయారంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో శైలజానాథ్‌ని పడేశారట వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ ఎఫెక్ట్ తన రాజకీయ భవిష్యత్ మీద పడుతుందని భావించడంతోనే.. అమరావతి పునర్నిర్మాణంపైన ఘాటుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నది పొలిటికల్ వర్గాల్లో నడుస్తోన్న టాక్. కానీ.. మీడియా ముందర రెచ్చిపోయిన అనేక మంది వైసీపీ నేతలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో రాజకీయంగా కాలగర్భంలో కలిపేశారన్న సంగతి శైలజానాథ్ కన్వినియంట్‌గా మరిచిపోయినట్లున్నారు. ఎందుకంటే ఈ మాత్రం తెలియకపోవడానికి ఆయనేమీ కొత్తగా పొలిటికల్ స్టెప్పులేస్తున్న లీడర్ కాదు. మరి చూడాలి మున్ముందు వైసీపీలో శైలజనాథ్ రోల్ ఎలా ఉండబోతుందో!