AVGC-XR Policy: ఆంధ్రప్రదేశ్‌ను గేమింగ్, అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (AVGC-XR) రంగాల్లో ఒక గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రం $531 బిలియన్ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, 2030 నాటికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే దిశగా AVGC-XR పాలసీని అమలు చేయాలని సంకల్పించింది. ఈ పాలసీ ద్వారా హాలీవుడ్ స్థాయి స్టూడియోల నుండి టెక్నికల్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులను రాష్ట్రానికి ఆకర్షించవచ్చు.
విశాఖపట్నాన్ని AVGC/గేమింగ్ కారిడార్‌గా అభివృద్ధి చేయడం ద్వారా, కొత్త కంపెనీల స్థాపన, పరిశ్రమల వృద్ధికి బలమైన పునాదులు వేయొచ్చు.ఈ విధానం రూపకల్పనలో APDTI నెట్‌వర్క్ డైరెక్టర్ శ్రీధర్ కోసరాజు, APVAGA అధ్యక్షుడు బాలాజీ గారు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా బాలాజీ గారు మాట్లాడుతూ – “ఇది రాష్ట్ర యువత ప్రతిభను నిలిపే గొప్ప అవకాశం. వీఎఫ్ఎక్స్, అనిమేషన్, గేమింగ్ రంగాల్లో ఉన్న ఆంధ్ర యువతకి రాష్ట్రంలోనే అవకాశాలు కల్పించేందుకు ఈ పాలసీ మార్గదర్శిగా నిలుస్తుంది,” అన్నారు.
Also Read: Cm chandrababu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
AVGC-XR Policy: ఇకపోతే, దేశవ్యాప్తంగా 15% AVGC-XR CEOs ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండగా, వేలాది మంది ఆంధ్ర సృజనాత్మకులు హైదరాబాద్, బెంగళూరులో ప్రముఖ స్టూడియోలలో పనిచేస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు 30-40% తక్కువ స్థాయి కార్యకలాప వ్యయం ఉండటంతో, పరిశ్రమలకు ఇది చక్కటి అవకాశంగా మారుతుంది.పాలసీ దాదాపుగా సిద్ధమై ఉండగా, స్టేక్‌హోల్డర్లతో వర్క్‌షాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరించాక అధికారికంగా ప్రకటించనున్నారు. హెడ్‌సెట్ తయారీ సంస్థలు, గేమ్ డెవలపర్లు, పరిశోధన కేంద్రాలు ఈ విధానం ద్వారా రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది. APVAGA, APDTI వంటి సంస్థల చురుకైన భాగస్వామ్యంతో రూపొందించిన ఈ విధానం, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో డిజిటల్ క్రియేటివ్ కేంద్రంగా నిలపనుంది.