Anil Ravipudi-Shankar: ప్రముఖ దర్శకుడు శంకర్ చెప్పిందే వేదవాక్కు! అనే తరహా మనిషి అని మరోసారి రుజువైంది. అందువల్లే దిల్ రాజు సైతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ విషయంలో ఇన్ వాల్వ్ కాలేకపోయారని, ఫలితంగా సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్లు దాటేసిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడా సినిమా ఎంత కలెక్ట్ చేసినా… దిల్ రాజుకు రూ. 200 కోట్ల రూపాయల వరకూ నష్టం వస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాంకు మంచి విజయం లభించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 106 కోట్ల రూపాయల గ్రాస్ ను వసులూ చేసింది. థియేట్రికల్ గానూ ఈ సినిమాకు రూ. 40 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates Today: రెండోరోజూ అదే తీరు.. తగ్గని బంగారం ధరల జోరు*
Anil Ravipudi-Shankar: గేమ్ ఛేంజర్ ద్వారా వచ్చే నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం మూవీ పూర్తి స్థాయిలో రికవర్ చేయకపోయినా… దిల్ రాజుకు కొంతో కొంత ఊరట కలిగించే ఆస్కారమైతే ఉంది. అనిల్ రావిపూడి పర్ ఫెక్ట్ ప్లానింగ్ మీద నమ్మకం ఉండటంతో దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం అనిల్ రావిపూడికి ఇచ్చాడని తెలుస్తోంది. శంకర్ తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోగా, అనిల్ రావిపూడి బాధ్యతతో పనిచేసి దిల్ రాజును ఓ రకంగా ఒడ్డెక్కించాడని సినీజనం భావిస్తున్నారు.