AAA-MAHAA MAX: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA)-మహామాక్స్ ఆధ్వరంలో 1వ మహాసభలకు ఏర్పాట్లు వేగంగా సాగిపోతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ముగ్గుల పోటీలు, షార్ట్ ఫిలిం కాంటెస్ట్, రీల్స్ కాంటెస్ట్, మ్యూజిక్ కాంటెస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం అందిస్తున్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ప్రైజ్ మనీ విజేతలకు ఇవ్వబోతున్నారు. కేవలం పోటీలలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికే కాకుండా.. మరో పదిమందికి కూడా ప్రోత్సాహక బహుమతులను ఇవ్వడం ద్వారా టాలెంట్ ఉన్నవారికి గుర్తింపు తీసుకువచ్చేలా ఈ పోటీలను డిజైన్ చేశారు.
AAA-MAHAA MAX: ప్రపంచంలోనే తొలిసారిగా ఇంస్టాగ్రామ్ రీల్స్ పోటీలను పరిచయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA)- మహామాక్స్ ఆధ్వర్యంలో పూర్తి ఆన్ లైన్ విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రీల్స్ పోటీలకు అద్భుతమైన స్పంద వస్తోందని చెబుతున్నారు AAA ఫౌండర్ హరి మోటుపల్లి. భారీ ప్రైజ్ మనీ తో పాటు రీల్స్ చేసే ఉత్సాహవంతులకు మరింత పాప్యులారిటీ పెరిగే విధంగా AAA – మాహామాక్స్ తో కలిసి ఈ పోటీలను డిజైన్ చేసినట్టు చెప్పారు. జనవరి 31 వరకూ పోటీలకు ఎంట్రీలు పంపే ఛాన్స్ ఉందని, ఉత్సాహవంతులు తమ రీల్స్ ను పంపించవచ్చని హరి మోటుపల్లి తెలిపారు.
AAA-MAHAA MAX: రీల్స్ పోటీల్లో పాల్గొనాలనే వారు https://nationalconvention1.theaaa.org/reg/reelcontest.html ఈ లింక్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని AAA నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల చెప్పారు. ఇప్పటికే ప్రతిరోజూ వందలాది రీల్స్ పోటీల కోసం వస్తున్నాయనీ.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక పోటీల్లో విజేతలకు భారీ బహుమతులు అందించనున్నట్టు AAA నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి వివరించారు. మొదటి బహుమతిగా 10 లక్షల రూపాయలు, రెండో బహుమతిగా 7 లక్షల రూపాయలు మూడో బహుమతిగా 4 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. అంతేకాకుండా, ప్రతిభ కనబరిచిన మరో 50 మందికి 10 వేల రూపాయల చొప్పున బహుమతితో పాటు AAA ట్రోఫీ, AAA సర్టిఫికెట్ ఇస్తామని హరిబాబు తెలిపారు.
అదీ విషయం. మారేందుకు ఆలస్యం.. అలా అలా సరదాగా రీల్స్ చేసి.. పోటీలకు పంపించేయండి. ఎందుకంటే, ఇప్పటికే బోలెడు మంది తమ రీల్స్ పంపించేశారు. పైగా పోటీలకు చివరి తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తోంది. అందుకని వెంటనే మీ టాలెంట్ ని బయటకు తీసి పోటీలకు రీల్స్ పంపండి.. బంపర్ ఛాన్స్ పెట్టేయండి.