America: అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడు ఉంటున్న నివాస ప్రదేశంలోనే అతడు మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనే యువకుడు అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. అతడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిలిపి ఉంచిన కారులో శవమై కనిపించాడు.