Good Bad Ugly: అజిత్ కుమార్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా యంగ్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అజిత్ అభిమానులకు పూర్తి వినోద భోజనంలా నిలిచిన ఈ సినిమా, థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తమిళనాడులో తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ చిత్రం, వారం రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 200 కోట్ల గ్రాస్‌ను అధిగమించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
తమిళ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దూసుకెళ్తోంది. మేకర్స్ అధికారిక వసూళ్లను వెల్లడించకపోయినా, సినిమా సాలిడ్ రన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ఆగుతుందనేది ఆసక్తికరంగా మారింది. జీవి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, అజిత్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.
