Interstellar: 2014లో విడుదలైన ఇంటర్ స్టెల్లార్ మూవీ ఇండియాలో ఫెయిల్ అయ్యింది. ఆ సినిమా ఒక పట్టాన సాధారణ ప్రేక్షకులకు అర్థం కాదంటూ విమర్శకులు సైతం పెదవి విరిచారు. అయితే… కొందరు మాత్రం ఇది కల్ట్ క్లాస్ మూవీ అంటూ టీమ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కన్ఫ్యూజ్డ్ కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఇంటర్ స్టెల్లార్ ఇప్పుడు ఇండియాలో ఫిబ్రవరి 7న విడుదల అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రీ-రిలీజ్ టైమ్ లో మూవీకి సూపర్ క్రేజ్ వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్ కోసం ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తుంటే… టకటకా హౌస్ ఫుల్ అయిపోతోంది.
ఇప్పటికే దాదాపుగా లక్ష టికెట్లు ఆన్ లైన్ ద్వారా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమాను చూసేందుకు దాదాపుగా 10 వేల మంది తమ టికెట్‌ను బుక్ చేసుకున్నారు. భూమి మీద మానవాళి నాశనంకు ఏదైనా ముప్పు వచ్చినప్పుడు మరెక్కడైనా జీవించడానికి అనువైన స్థలం ఉందా అనే పరిశోదనలు జరపడం కోసం నలుగురు వ్యోమగాములు సిద్ధం అవుతారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి, మానవాళికి కొత్త నివాసయోగ్యమైన ప్రాంతాన్ని వారు గుర్తించారా లేదా అనేదే దీని కథ. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ నిర్మించారు.