Adi narayana: కడప ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యి జేసీ ప్రభాకర్ రెడ్డిని, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో భేటీ అయ్యేందుకు పిలిపించారు. ఈ మీటింగుకు ఆదినారాయణ రెడ్డి హాజరు కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆదినారాయణ మాట్లాడుతూ వివాదాన్ని సీఎం చంద్రబాబునాయుడికే వదిలేశానని అన్నారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక అవసరాల తీరిన తర్వాతే ఫ్లైయాష్‌ను తరలించాలని చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబుతో మీటింగ్‌కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం ఆయన కుమారుడినైనా పంపిస్తే బాగుండేదన్నారు. సొంత కూటమిపైనే విమర్శలు చేయడం జేసీకి తగదని సూచించారు. ఈ వివాదం చిన్నదేనని, సీఎం చంద్రబాబు చాలా ఈజీగా పరిష్కరించగలరని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాకుండా ఇంత లేఖ రాస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. జేసీ వచ్చి ఉంటే చర్చ జరిగేదని, పంచాయితీ అటో ఇటో తేలిపోయేదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.