Chandrababu: జైలు శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జైల్ల అధికారులు చేసిన తప్పులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైలులో సకల రాజభోగాలపై సీఎం చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నారు. వెంకటరెడ్డికి జైలులో కొత్త ఫ్రిజ్, టీవీ సమకూర్చారని నివేదికలో సీఎం బాబుకి తెలిసింది.బయట నుంచి రోజూ భోజనం ఎలా తెచ్చారని అధికారులను చంద్రబాబు నిలదీశారు.బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ప్రభుత్వ ఖజానాకు 2 వేల 566 కోట్ల రూపాయల ఆదాయానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కేసులో ఏ-1 గా వెంకటరెడ్డి, ఏ2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారామ్ కామత్, ఏ3 గా ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పి.అనిల్ కుమార్, ఆర్.వెంకట కృష్ణారెడ్డి, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి, ఏ4గా ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) ఏ5గా, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్ ఏ6గా చేర్చారుు. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ7లతో పాటు ఇతరులను నిందితులుగా ఏసీబీ పేర్కొంది