Vikram: తమిళ ఇండస్ట్రీ లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) వివాదంలో చిక్కుకున్నారు. తాను పెంపుడు జంతువుగా పెంచుకుంటున్న ‘లార్ గిబ్బన్’ (Lar Gibbon) అనే అరుదైన విదేశీ వానరంతో ఆడుకుంటున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడమే ఇందుకు కారణమైంది.
మొదట ఈ వీడియో అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, ఆ జీవి అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణి కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం ప్రారంభించారు.
లార్ గిబ్బన్ ఎక్కడిది? అటవీశాఖ విచారణలో ఏం తేలింది?
-
మలేసియా నుంచి ప్రయాణం: పత్రాల ఆధారంగా ఆ వానరం మొదట మణిపుర్‌కు చెందిన లైకురామ్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలిసింది. మలేసియాకు చెందిన మొత్తం 8 పిల్లలను పెంచుకోవడానికి ఆయన చట్టబద్ధమైన అనుమతి పొందారు.
-
చేతులు మారిన వానరం: ఆ ఎనిమిదింటిలో మూడింటిని ఈరోడ్ జిల్లా పెరుంతురైకి చెందిన కేశనాథన్‌కు అందించగా, వాటిలో ఒకదానిని ప్రస్తుతం విక్రమ్ సంరక్షిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వివాదం ముదరడంతో విక్రమ్ ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
మరోవైపు, విక్రమ్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక కుక్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
