Hyderabad

Hyderabad: ఇతర వ్యక్తుల ID రుజువులను ఉపయోగించి వాహనాలు కొనుగోలు

Hyderabad: ఎవరికైనా మీకు సంబంధించిన గుర్తింపు పత్రాలు ఇస్తున్నారా….మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలు ఇస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. మీ ఐడీ కార్డులను ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశముంది. ఇలాగే పాతబస్తీలో ఓ ముఠా పెద్ద ప్లానే వేశారు. ఇతరుల ధృవపత్రాలతో పలు షోరూములు, ఫైనాన్స్ కంపెనీల.

ఫైనాన్స్ కోసం వారి ఐడీ రుజువులను తీసుకుంటారు. వారికి తెలియకుండానే వెహికల్స్ తీసుకుంటారు. గుట్టుచప్పుడు కాకుండా ఆమ్మే జల్సాలు చేస్తారు. ఇలా ఈవి వాహనాలు కాజేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.44.80 లక్షలు విలువ చేసే 27 టీవీఎస్ ఖ్యూబ్, సుజుకి Burgman వాహనాలను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

వివిధ షోరూమ్‌లు, ఫైనాన్స్ కంపెనీల నుండి కొనుగోలు చేశారు. ఇతర వ్యక్తుల ID రుజువులను ఉపయోగించి వాహనాలు కోనుగోలు చేస్తున్నారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫైనాన్స్‌లో ఇతర ఐడీ ప్రూఫ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఇలా కొనుగోలు చేసిన వాహనాలనను అధిక ధరలకు విక్రయించడం, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ రాయితీలను పొందుతున్నారు కేటుగాళ్లు.

హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన మీర్జా బకర్ అలీ బేగ్, బహదూర్ పురాకు చెందిన సయ్యద్ తన్వీర్, మలక్ పేటకు చెందిన సచిన్ .జాఫర్ అలీ మూస్వీ సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు, అమ్మకం వ్యాపారంలో భాగస్వాములు. తమ సంస్థలో ఆర్థిక ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటున్న వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న మలక్ పేటకు చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సకాలంలో ఫైనాన్స్ వాయిదాలను కవర్ చేస్తామని నమ్మించి బాధితులను మోసం చేస్తున్నారు.

కొద్ది మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి అమాయక, నిరక్షరాస్యుల ID రుజువులను ఉపయోగించి ఫైనాన్స్‌పై ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. తరువాత, వాహనాన్ని ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయని, వారు వాహనంపై ఫైనాన్స్ క్లియర్ చేశారని, త్వరలో వారు వాహనాన్ని వారి పేరుపై బదిలీ చేస్తారని చెప్పడం ద్వారా అవసరమైన వినియోగదారులకు తక్కువ ధరలకు అదే వాహనాలను విక్రయిస్తున్నారు.

ఈ వాహనాలను అవసరమైన కస్టమర్లకు తక్కువ ధరలకు విక్రయించారు. ఆరు నెలల తర్వాత, ప్రభుత్వ సబ్సిడీలు అసలు వాహన యజమానుల బ్యాంకు ఖాతాలకు జమ కాగానే, నిందితులు వారికి కొంత సబ్సిడీ మొత్తాలను అందజేస్తామని మోసం చేశారు. ఈ ముఠా గుట్టును ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. మలక్ పేట పోలిసులసహాయం తో ఛేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *