Narasimha

Narasimha: సూపర్‌హిట్‌ సినిమా ‘నరసింహ‌’ సీక్వెల్‌.. టైటిల్‌ ప్రకటించిన రజనీకాంత్‌

Narasimha: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిన చిత్రం ‘నరసింహ’. ఈ సినిమా 25 ఏళ్లు పుర్తి కానున్నాయి. 1999లో థియేటర్లలో భారీ హిట్‌ అందించిన ఈ చిత్రం రమ్యకృష్ణ, సౌందర్య చేసిన పాత్రలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేశాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రానుంది.

డిసెంబర్ 12న రజనీకాంత్ 75వ పుట్టినరోజు జరుపుకోనుండగా,  నరసింహ మూవీని రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో రజనీ ‘నరసింహ’ సీక్వెల్‌పై కీలక ప్రకటన చేశారు. ‘‘ఎన్నో సినిమాలు సీక్వెల్‌లతో వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత భారీ హిట్‌ అయిన నరసింహకు సీక్వెల్‌ ఎందుకు చేయకూడదు అనిపించింది. 2.0 (రోబో సీక్వెల్), జైలర్ 2 చిత్రాల సమయంలో ఈ ఆలోచన వచ్చింది.

Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజ‌న్‌9లో ఊహించ‌ని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేష‌న్.. బయటకు వెళ్లేది ఎవరంటే?

నరసింహ సీక్వెల్‌కు ‘నీలాంబరి’ (Neelambari) అనే టైటిల్‌తో మీకు అందిస్తాం. ఈ సీక్వెల్‌లో నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు రజనీ తెలిపారు. గతంలో ఈ పాత్ర కోసం ఐశ్వర్యా రాయ్, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లను కూడా సంప్రదించినప్పటికీ, చివరికి రమ్యకృష్ణ ఎంపికై ఆ పాత్రను ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. ఈ పాత్ర ఇప్పటికీ సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌ అవుతుండటం చిత్రానికి ఉన్న ప్రభావాన్ని చూపిస్తుంది.

సౌందర్య నటించిన వసుంధర పాత్ర, రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రలు ‘నరసింహ’ చిత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాయి. విడుదలైన 25 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా అభిమానుల్లో అదే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ప్రకటించినట్లుగా, 2025 డిసెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ రీరిలీజ్‌ కానుంది. అప్పటి తరాన్ని మళ్లీ థియేటర్లకు తీసుకెళ్లడానికి ఈ రీరిలీజ్ సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *