Meesho IPO: సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ-కామర్స్ దిగ్గజం మీషో (Meesho) తో పాటు, వైండింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్య వైర్స్ (Vidya Wires) కూడా వచ్చే నెల మొదటి వారంలో తమ ఐపీఓ (IPO) లతో పెట్టుబడిదారుల ముందుకు రానున్నాయి. ఈ రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ఒకే రోజు – డిసెంబర్ 3న – ప్రారంభమై, డిసెంబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి.
మీషో ఐపీఓ: మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ-కామర్స్ యూనికాన్
ఈ-కామర్స్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న మీషో, మార్కెట్ నుంచి రూ.5,421 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.రూ.105 నుంచి రూ.111 మధ్య నిర్ణయించారు. ఈ ధరల బ్యాండ్ ఎగువ స్థాయిలో మీషో వాల్యుయేషన్ రూ.50,096 కోట్లుగా ఉంది.
ఇందులో రూ.4,250 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు, రూ.1,171 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ఓఎఫ్ఎస్లో కంపెనీ వ్యవస్థాపకులు, తొలి పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయించనున్నారు.తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను ప్రధానంగా క్లౌడ్ సంబంధిత మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, బ్రాండింగ్ కార్యక్రమాలు, భవిష్యత్తులో జరిగే విలీనాల కోసం వినియోగించనున్నారు.
కీలక తేదీలు:
-
-
యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపు: డిసెంబర్ 2.
-
ఐపీఓ ప్రారంభం/ముగింపు: డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు.
-
లిస్టింగ్ తేదీ: డిసెంబర్ 12న మీషో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.
-
-
రిజర్వేషన్లు: ఇష్యూలో అత్యధికంగా 75 శాతం షేర్లను అర్హత ఉన్న సంస్థాగత కొనుగోలుదారులకు (QIB), 15 శాతం నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII), మిగిలిన 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
-
కంపెనీ పనితీరు (FY25): 2025 ఆర్థిక సంవత్సరంలో మీషో రూ.29,988 కోట్ల నికర వ్యాపార విలువ (NMV)ను సాధించింది. అయితే, ఇదే కాలంలో కంపెనీ రూ.3,942 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Thanjavur: పెళ్లికి నో చెప్పిందని .. టీచర్ అని కూడా చూడకుండా ఏసేశాడు!
విద్య వైర్స్ ఐపీఓ: వైండింగ్ ఉత్పత్తుల కంపెనీ సైతం రెడీ
వైండింగ్, కండక్టింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న విద్య వైర్స్ కూడా మీషోతో పాటు డిసెంబర్ 3న ఐపీఓను ప్రారంభించనుంది. ఈ కంపెనీ మొత్తం రూ.300 కోట్లు సమీకరించాలని చూస్తోంది. షేర్ ధరను రూ.48-–52గా నిర్ణయించారు. ఎగువ స్థాయిలో కంపెనీ విలువ రూ.1,100 కోట్లకు పైగా ఉంది.
కీలక తేదీలు:
యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపు: డిసెంబర్ 2.
ఐపీఓ ప్రారంభం/ముగింపు: డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు.
డిసెంబర్ మొదటి వారం దేశీయ స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. మీషో వంటి భారీ టెక్ కంపెనీ లిస్టింగ్, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.
