Ethiopia:

Ethiopia: భార‌త్‌పై ఇథియోఫియా అగ్నిప‌ర్వ‌తం లావా ఎఫెక్ట్‌

Ethiopia:ఇథియోఫియాలో బ‌ద్ద‌లైన అగ్నిప్ర‌మాదం ప్ర‌భావం భార‌త‌దేశంపైనా ప‌డుతుంది. ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ఇథియోఫియాలో 10 వేల ఏళ్ల‌లో తొలిసారి హేలీ గ‌బ్బీ వాల్క‌నో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది. 10 నుంచి 15 కిలోమీట‌ర్ల ఎత్తుకు బూడిద వెద‌జ‌ల్లుతున్న‌ది. ఈ ప్ర‌భావంతో అంత‌ర్జాతీయ‌ విమానాల రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతున్న‌ది. ఈ ప్ర‌భావంతో కేర‌ళలోని క‌న్నూరు నుంచి అబుదాబి (యూఏఈ) వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా దారి మ‌ళ్లించారు.

Ethiopia:ఆ బూడిద రేణువులు ఉత్త‌ర భార‌త‌దేశం వైపు వ్యాపిస్తున్నాయి. దీంతో మ‌రికొన్ని ఎయిర్‌లైన్స్ స‌ర్వీసుల‌ను కూడా వేరే రూట్ల‌లో న‌డిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ పొగ ఢిల్లీ ప‌రిస‌రాల‌కు చేరింది. 130 కిలోమీట‌ర్ల వేగంతో ఎర్ర‌స‌ముద్రం మీదుగా బూడిద దూసుకొస్తున్న‌ది. తొలుత రాజ‌స్థాన్‌లో ప‌డుతున్న‌ట్టు ఆ బూడిద క‌నిపించింది. ఆకాశంలో బూడిద‌తో కూడిన మేఘాలు 25, 45 వేల అడుగుల దూరంలో వ్యాపించి ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు తెలిపారు.

Ethiopia:ఇథియోఫియా అగ్నిప‌ర్వ‌తం నుంచి వెలువ‌డుతున్న బూడిద భార‌త‌దేశంలోని రాజ‌స్థాన్ నుంచి హ‌రియానా, గుజ‌రాత్‌, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు వ్యాపించే అవ‌కాశం ఉన్న‌ద‌ని హెచ్చ‌రికలు జారీ అయ్యాయి. ఈ పొగ వ‌ల్ల విమాన రాక‌పోక‌లపైనా ప్ర‌భావం ప‌డుతుంది. దాని వ‌ల్ల వాతావ‌ర‌ణంలో పెనుమార్పులు వ‌చ్చే ప్ర‌మాదం కూడా లేక‌పోలేద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *