Road Accident: నెల్లూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, పెళ్లకూరు మండలం, దొడ్లవారిమిట్ట వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ బస్సు విశాఖపట్నం నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తున్నట్లు సమాచారం.
తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: 50 Years Of Rajinikanth: రజనీకాంత్ టైమ్స్ .. సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ సామ్రాజ్యానికి హిందుస్థాన్ టైమ్స్ గ్రేట్ ట్రిబ్యూట్
ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు మాట్లాడుతూ… బస్సు డ్రైవర్ అతివేగం, నిద్ర మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
