Viral News: కామాంధులు సందుసందుకు ఉంటారని వెనుకటికి ఓ సాధు చెప్పారు.. ఇటీవల జరుగుతున్న విపరిణామాలను పరిశీలిస్తే ఇంటింటికీ కామాంధులు తయారై ఉన్నారు. అద్దెకు ఉన్న ఇంటిలో అమానుషమే చోటుచేసుకున్నది. ఆ ఇంటి స్నానాల గదిలో అమర్చి ఉన్న సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉండే దంపతులు గుర్తించారు. ఇది ఎన్నాళ్ల నుంచి ఉన్నదో కానీ, ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది.
Viral News: హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంటిలో ప్రైవేటు ఉద్యోగంలో పనిచేసే వివాహిత (23) తన భర్తతో కలిసి అద్దెకు నివాసం ఉంటున్నది. ఈ నెల 4న తమ స్నానాల గదిలో విద్యుత్తు బల్బ్ పనిచేయడం లేదని ఆ ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు ఆ వివాహిత చెప్పింది. అతను ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ మరమ్మతు చేయించాడు.
Viral News: ఇదే నెల 13న బాత్రూమ్లోని బల్బ్ హోల్డర్ నుంచి స్క్రూ కింద పడిపోయింది. దానిని గమనించిన అద్దె మహిళ భర్త.. హోల్డర్‌ను పరిశీలించగా లోపల ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించి కంగుతిన్నాడు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు ఆ విషయం చెప్పారు. ఎలక్ట్రీషియన్ ఈ పనిచేసి ఉంటాడని, అతన్నే అడగాలని ఆ ఇంటి యజమాని వారికి తేల్చి చెప్పాడు. ఒకవేళ కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చి మీకు హాని చేస్తాడని బెదిరించాడు.
Viral News: దీంతో అనుమానం వచ్చిన అద్దె కుటుంబం ఏకంగా ఆ ఇంటి యజమాని, ఎలక్ట్రీషియన్‌పై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆ ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయగా, ఎలక్ట్రీషియన్ చింటు పరారీలో ఉండగా, అతనికోసం గాలిస్తున్నారు. ఇక నుంచి అద్దెకు ఉండే కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్న మాట.