Beauty

Beauty: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కల్ట్ ప్రొడ్యూసర్ SKN.. యువతులు, వారి పేరెంట్స్ కోసం బ్యూటీ సినిమా ఫ్రీ షో..

Beauty: కల్ట్ ప్రొడ్యూసర్ SKN కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మంచి సినిమాలు తీయడమే కాకుండా మంచి సినిమా వస్తే కచ్చితంగా సపోర్ట్ చేస్తారు. తాజాగా ఓ సినిమాని చూసి అది నచ్చడంతో జనాలకు ఇంకా ఎక్కువ చేరువ కావాలని తనే డబ్బులు పెట్టుకొని ఫ్రీ షో వేస్తాను అని ప్రకటించారు. అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

Also Read: Bathukamma Young Filmmakers Challenge: బతుకమ్మపై షార్ట్ ఫిల్మ్, పాటల పోటీలు: తెలంగాణ యువతకు అద్భుత అవకాశం!

ఇటీవల బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత SKN మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. ఇలాంటి సినిమా ఎక్కువమందికి చేరువ కావాలి. ఈ సినిమా ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ తో చూడాల్సిన సినిమా. అందుకే నా వంతు ప్రయత్నంగా అమ్మాయిలకు, వాళ్ళ ఫ్యామిలీలకు ఒక స్పెషల్ షో ఫ్రీగా వేస్తాను అని ప్రకటించారు. చెప్పినట్టుగానే నిర్మాత SKN బ్యూటీ సినిమా ఫ్రీ షో వేస్తున్నారు. ఈ ఫ్రీ షో వివరాలు తన సోషల్ మీడియాలో ప్రకటించారు.

నిర్మాత SKN తన సోషల్ మీడియాలో.. బ్యూటీ సినిమా ఫ్రీ షోని యువతులు వారి పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు. హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో సెప్టెంబర్ 18న రాత్రి 7 గంటల 40 నిమిషాల షోకి వచ్చి బ్యూటీ సినిమాని ఫ్రీగా చూడొచ్చు. ఇందుకు గాను ఈ షోకి రావాలనుకున్న యువతులు +91 8639000916 నెంబర్ కి వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకొని వచ్చి ఒక మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని తెలిపారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా రిజిస్టర్ చేసుకొని మీ పేరెంట్స్ తో వచ్చి బ్యూటీ సినిమాని చూడండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *