Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే అసలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ప్రజలకు చెడు సంకేతాలు వెళ్తాయని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై ఎటువంటి మినహాయింపులు లేకుండా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
“ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేలుగా ఉండటం అంటే బాధ్యత, క్రమశిక్షణ. నియమాలు పాటించకపోతే ఎవరినీ విడిచిపెట్టం” అని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించడం తగదని, ఎమ్మెల్యేలంతా తమ ప్రవర్తనలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
