Ec : బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై ఈసీ స్పష్టీకరణ

Ec: బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణపై వస్తున్న ఆరోపణలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది. ఓట్ల చోరీ ఆరోపణలను ఖండిస్తూ, చట్టపరంగా ఎన్నికల కమిషన్ ఎల్లప్పుడూ పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది.

“చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుంది. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదు” అని స్పష్టంచేసింది.

ఓటు చోరీ ఆరోపణలపై ఈసీ స్పందిస్తూ – “అలాంటి తప్పుడు ప్రచారం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం అవుతుంది. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదు” అని వ్యాఖ్యానించింది.

SIR ప్రక్రియలో (Special Summary Revision) ఓటరు పేరు తొలగించినా, లేదా ఏదైనా లోపం ఉన్నా, దానిపై పౌరులు అభ్యంతరాలు తెలపవచ్చని ఈసీ తెలిపింది.

బీహార్‌లో జరుగుతున్న SIR ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేశాం అని స్పష్టం చేసింది.

చివరగా ఈసీ హెచ్చరిస్తూ – “ఓటు చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేయడం, ఎన్నికల ప్రక్రియను దూషించడం అంటే రాజ్యాంగాన్నే అవమానించడం అవుతుంది” అని పేర్కొంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *