JMD Ex MLA Sudheer

JMD Ex MLA Sudheer: ఆయన వదిలేశాడా? వైసీపీనే వదిలించుకుందా?

JMD Ex MLA Sudheer: అధికారంలో ఉన్నన్ని రోజులు నియోజవర్గంలో ఆయనదే హవా. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ వసూళ్లకు ఆయనే ఫేమస్‌. ఆయన మాట తీరు వల్ల సొంత పార్టీ కార్యకర్తలే విసుగు చెందారట. ఐదేళ్లు అధికారం చెలాయించి, అంతా తానై నడిపించి, ఇప్పుడు పవర్‌ నుండి దిగిపోవడంతో నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదట. ఆయనే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. ప్రస్తుతం జమ్మలమడుగులో ఆ నేత కనపడుట లేదంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. పరిస్థితి చూస్తుంటే.. వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడిందా, వైసీపీ కూడా సుధీర్ రెడ్డి వివాదాస్పద తిరుతో విసుగు చెందిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పార్టీకి దూరమయ్యాడా లేక పార్టీనే దూరం పెట్టిందా అన్న డిస్కషన్‌ నడుస్తోంది జమ్మలమడుగు సర్కిల్స్‌లో. ఇక సుధీర్ రెడ్డి వైసీపీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలే పండగ చేసుకుంటున్నారట.

Also Read: Air India flight: విమానంలోనే మ‌హిళ ప్ర‌స‌వం

అధికారం ఉంటే ఆయన యమా స్పీడ్. అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేనంత వీక్… అంటూ జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోందట. గత వైసీపీ ప్రభుత్వంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే… ఇప్పుడు కనిపించడం లేదంటున్నారు జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్యకర్తలు ఆయన దగ్గరికి వెళ్లాలంటే చెవులు మూసుకోవాల్సిందేనంట. తనను కాదని తన పార్టీ ఎంపీ దగ్గరకు వెళ్లినా కూడా కార్యకర్తలను ఎడా పెడా వాయించేవారట సుధీర్‌ రెడ్డి. ఇలా ఐదేళ్లలో జమ్మలమడుగులో ఆయన ఆస్తులు అభివృద్ధి అయ్యాయి తప్ప… నియోజకవర్గ అభివృద్ధి శూన్యం అని వైసీపీ క్యాడరే చెబుతుండటం గమనార్హం.

మొత్తానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ఇప్పుడు వైసీపీకి, జమ్మలమడుగుకు దూరంగా ఉన్నాడా..? లేక నోటి దురుసు కారణంగా పార్టీ పెద్దలే పక్కన పెట్టేశారా? అన్నది తెలీదు కానీ.. ఏది ఏమైనా సుధీర్ రెడ్డి జాడ లేకపోవడం… ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో సంతోషానికి కారణమవుతోందట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *