Mohammed Shami: భారత క్రికెటర్, స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. షమీ భార్య హసిన్ జహాన్, వారి ఏకైక కుమార్తెకు నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. షమీ చెల్లించే భరణ మొత్తంలో రూ.2.5 లక్షలు షమీ కూతురికి ఇవ్వనున్నారు. మిగిలిన రూ.1.5 లక్షలు షమీ భార్య హసిన్ కు అందజేయనున్నారు. హైకోర్టు న్యాయమూర్తి అజయ్ ముఖర్జీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో దాఖలు చేసిన కేసులో హసిన్ జహాన్ షమీని నెలకు రూ.7 లక్షలు భరణంగా, తన కూతురికి రూ.3 లక్షలు చెల్లించాలని కోరింది.
ఇది కూడా చదవండి: RCB: ఆర్సీబీకి షాక్: విజయోత్సవ వేడుకల తొక్కిసలాటపై బీసీసీఐ నోటీసులు!
అయితే, దిగువ కోర్టు షమీని హసిన్ కు రూ.50,000, తన కూతురికి రూ.80,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హసిన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు దాఖలు చేసిన పత్రాలలో, మహమ్మద్ షమీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.7.19 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారని హసిన్ పేర్కొన్నారు. ఉత్తర్వులు జారీ చేసిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అజయ్ ముఖర్జీ దిగువ కోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. షమీ మాజీ భార్య హసిన్ జహాన్, కుమార్తె షమీ ఆదాయం నుండి నెలకు కనీసం రూ.4 లక్షల భరణం పొందేందుకు అర్హులని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసును 60 రోజుల్లోగా పరిష్కరించాలని హైకోర్టు దిగువ కోర్టును ఆదేశించింది.
