Peddi OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ఇటీవల థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ఇపుడు డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) భాగస్వామిగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix), తాజాగా దీని అధికారిక డిజిటల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ.. రాబోయే జూలై 9 నుండి ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా హోమ్ స్క్రీన్స్‌పై ఎంజాయ్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
