lawrence bishnoi

Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి కీలక పదవి.. ఎక్కడంటే..

Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని జైలులో ఉన్నారు. ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ జీవ్ రక్షా మోర్చా యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు జీవ్ రక్షా మోర్చా అధికారికంగా లేఖ విడుదల చేసింది. జీవరాశుల రక్షణకు చేసిన ఆదర్శప్రాయమైన కృషిని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం చేపట్టామన్నారు. ఈ విషయాన్ని మోర్చా అధ్యక్షుడు ఇంద్రపాల్ బిష్ణోయ్ ప్రకటించారు. మీ బాధ్యతలను పూర్తి భక్తితో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ పై నమ్మకాన్ని ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: Jammu and Kashmir: కాశ్మీర్ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. ఎన్నికల తరువాత భద్రతా బలగాల తగ్గింపు

మోర్చా అధ్యక్షుడు తరపున, ఫాజిల్కా జిల్లా అబోహర్ తహసీల్, దుత్రన్‌వాలి గ్రామం, రహద్ గ్రామం నివాసి రవీంద్ర కుమారుడు లారెన్స్ బిష్ణోయ్ అఖిల భారత జీవ్ యువమోర్చా విభాగం జాతీయ అధ్యక్షుడిగా నామినేట్ అయినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.  జీవిత రక్షణ,  పర్యావరణ రంగంలో స్వచ్ఛంద కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఈ పదవిలో ఉన్నవారి బాధ్యతగా చెబుతారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  mahesh kumar goud: హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *