Ravi Shastri: ధోని వెనక ఉంటే భయపడేవారు

Ravi Shastri: మాజీ భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి, మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం లభించిన సందర్భంలో, ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని గొప్పగా ప్రశంసించారు. “అతను కళ్లు మూసి తెరిచే లోపు స్టంపింగ్‌ చేస్తాడు, ధోనీ స్టంపింగ్‌ల వేగం అనిర్వచనీయమైనది,” అని రవిశాస్త్రి తెలిపారు.

ఐసీసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, “ధోనీ ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. క్రీజు కొంచెం దాటినా, రెప్పపాటు వేగంతో స్టంప్ అవుట్ చేస్తాడు. అతడి వికెట్ కీపింగ్ కళ్ళకు కనిపించకపోయినా, బ్యాటర్లకు భయాన్ని కలిగించేదీ,” అని చెప్పారు.

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ గర్వించదగ్గ రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్ మొత్తం మీద 195 స్టంపింగ్‌లు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే, 829Dismissals తో ప్రపంచ క్రికెట్‌లో మూడవ అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు.

కేవలం కీపింగ్‌ లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ ధోనీ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో జట్టును గెలిపించే విధంగా ఆడటంలోనూ, ‘హెలికాప్టర్ షాట్’ లాంటి వినూత్న శైలితో గుర్తింపు పొందడంలోనూ అతడు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు అనేక అద్భుత విజయాలు అందించిన ఘనత కూడా ధోనీదే.

రాజీనామా చేసినా… క్రికెట్ ప్రపంచంలో ధోనీ స్థానం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలవనుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *