Kannappa: విష్ణు మంచు హీరోగా టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్, పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ మూవీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజా బజ్ ప్రకారం, ‘కన్నప్ప’ రన్‌టైమ్ మూడు గంటలకు పైగా ఉండనుందట! ఇంత లాంగ్ రన్‌టైమ్ ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశం. ఈ భారీ కథను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారు? చిత్ర యూనిట్ ఈ టాక్‌పై ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి.
