Operation Sindoor

Operation Sindoor: ఆప‌రేష‌న్ సిందూర్.. 100 మందికి పైగా టెర్రరిస్టులు హ‌తం..!

Operation Sindoor: పహల్గాం వద్ద జరిగిన పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్ సైన్యం, బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారీ స్థాయిలో మెరుపుదాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌లో  100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు అని భద్రతా వర్గాలు వెల్లడించాయి.

ఇండియన్ ఆర్మీ ఈ దాడిని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్ర సంస్థలపై స్పష్టమైన దెబ్బగా నిర్వహించింది. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా మిస్సైల్‌ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ధ్వంసమైన టెర్రర్ నర్సరీలు:

బహవల్పూర్‌లోని జైష్ శిబిరం, ముర్కిదేలోని లష్కరే తోయిబా క్యాంపులు ప్రధాన టార్గెట్లుగా మారాయి. వీటిలో ఒక్కో స్థావరంలో 25–30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ప్రత్యేకించి ముర్కిదే ప్రాంతం, దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉండి ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా పాఠశాలల కంటే ఎక్కువగా పని చేస్తోంది. ఇది లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు నాడీ కేంద్రంగా పేరుపొందింది.

ఇది కూడా చదవండి: Operation Sindoor: భారత దాడిలో టాప్ కమాండర్ మృతి.. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లు హతమయ్యారా?

“న్యాయం జరిగింది” – భారత సైన్యం సందేశం:

ఈ దాడుల అనంతరం భారత సైన్యం అధికారికంగా “న్యాయం జరిగింది” అనే సందేశాన్ని వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఉగ్రవాదుల పర్యాటకులపై దాడి దేశ ప్రజల హృదయాలను గాయపరిచిన నేపథ్యంలో, ఈ ప్రతీకార దాడి ప్రజల్లో ధైర్యాన్ని నింపింది.

ఇతర వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు:

ఇప్పటికీ ఉగ్ర స్థావరాల్లో నిజంగా హతమయ్యినవారి ఖచ్చిత సంఖ్యను నిఘా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఇది భారత సైనిక వ్యూహాత్మక విజయం కావడం ప్రత్యేకతగా నిలిచింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *