YCP Stand 3 Capital

YCP Stand 3 Capital: అమరావతికి కొనసాగనున్న జగన్‌ గండం!

YCP Stand 3 Capital : మూడు రాజధానులపై వల్లమాలిన వ్యామోహం, అమరావతిపై అక్కసు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలనే ప్రజల ఆకాంక్షను విస్మరించి, మూడు రాజధానుల వాదనతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిన జగన్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోలేదు. అమరావతిపై ఆయన కక్ష ఏమాత్రం తగ్గకపోవడం, ఆయన రాజకీయ వ్యూహంలో మార్పు లేదన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. 2019-2024 మధ్య వైసీపీ పాలనలో జగన్ అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేశారు. ఈ నిర్ణయం రైతుల నుండి భూములు సేకరించిన అమరావతి ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసింది. 2024 ఎన్నికల్లో ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని స్పష్టం చేస్తూ వైసీపీని ఓడించారు. అయినప్పటికీ, జగన్ తన మూడు రాజధానుల వాదనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టమౌతోంది.

ఇటీవల అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైనప్పుడు, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై, అమరావతిపై విషప్రచారం చేయడం, టెండర్లలో అవినీతి ఆరోపణలు చేయడం అమరావతి పట్ల జగన్‌ వ్యతిరేకతను బహిర్గతం చేస్తోంది. అమరావతి పరిధిలో శిలాఫలకం ధ్వంసం ఘటన… జగన్ వర్గం సైకో చేష్టలకు నిదర్శనం. ఈ ఘటన తర్వాత కూటమి ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించినప్పటికీ, జగన్ నీతిమాలిన రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మళ్లీ అమరావతి నిర్మాణంపై విష ప్రచారం, కేసులతో అడ్డుకోవాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం జగన్‌.. తన నమ్మినబంటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి రంగంలోకి దించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read: india vs pakistan: యుద్ధం వ‌స్తే భార‌త్‌లో ప్ర‌భావిత ప్రాంతాల గుర్తింపు?

YCP Stand 3 Capital: గత ఎన్నికలకు ముందు జగన్‌ తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా పక్కన పెట్టాడన్న కారణంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కుప్పిగెంతులు అన్నీఇన్నీ కాదు. అయితే.. ఏదోలా ఎన్నికలకు ముందే మళ్లీ వైసీపీ గూటికి చేరిపోయారు కానీ.. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని జగన్‌ అప్పగించిన టార్గెట్‌ మాత్రం నెరవేర్చలేకపోయారు. కేసులతో అమరావతిని అడ్డుకోవడంలో విశేష అనుభవం గడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు జగన్‌ మళ్లీ మంగళగిరి ఇన్‌చార్జ్‌గా నియమించి, అమరావతిని భ్రష్టు పట్టించే బాధ్యతలు అప్పగించబోతున్నారట. ఈ చర్యలు అమరావతిపై జగన్‌ ఎంత కక్ష పెట్టుకున్నాడో స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నప్పుడు, జగన్ కక్ష పూరిత వైఖరితో వెళ్తే మాత్రం… వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాపరమైనదిగా మారుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ  Adudam Andhra Scam: రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలా దొరికేశారేంటి?

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *