Tirumala News: జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం దాడిలో 26 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనసమ్మర్థమైన స్థలాల్లో ముమ్మర తనిఖీలను చేపడుతున్నారు. ఈ మేరకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదన్న నిఘా వర్గాల సమాచారం మేరకు టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది.
Tirumala News: అలిపిరి తనిఖీ కేంద్రంతోపాటు ఘాట్ రోడ్లలోనూ పలుచోట్ల ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర ప్రైవేటు వాహనాలను నిలిపేసి తనిఖీలు చేస్తున్నారు. వాహనాల్లో తీసుకెళ్తున్న లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. తిరుమల ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tirumala News: ప్రతి ఒక్క అనుమానితుడిని తప్పనిసరిగా విచారిస్తున్నారు. వారి నుంచి వివరాలను సేకరిస్తూ పూర్తిస్థాయిలో ఆధారాలను రాబడుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. కొండపైన ఎక్కడ పడితే అక్కడ గుమిగూడిన జనం వద్ద, వాహనాలు నిలిపిన చోట తనిఖీలను ముమ్మరం చేశారు. తిరుమల, తిరుపతి, ఇతర టీటీడీ స్థలాల్లో భద్రతా సిబ్బందిని అలర్ట్గా ఉంచారు.

