AA22

AA22 : మెంటలెక్కిస్తున్న AA22 ప్రాజెక్ట్!

AA22 : సినిమా అభిమానులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కలిసి ఓ సంచలన ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. కోలీవుడ్ దిగ్గజ బ్యానర్ సన్ పిచర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటనతో పాటు ఓ జోష్‌ఫుల్ వీడియోను రిలీజ్ చేసి అభిమానుల్లో హైప్ పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ వీడియో చూస్తే ఇది కేవలం పాన్ ఇండియా స్థాయి కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుందని స్పష్టమవుతోంది.

అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా, అట్లీ దర్శకత్వంలో 6వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ.. హాలీవుడ్ లెవెల్ విజువల్స్‌తో షాకిచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే బన్నీ, అట్లీ అమెరికా పర్యటనలో స్పైడర్‌మ్యాన్, అవతార్ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌కు VFX అందించిన టాప్ స్టూడియోస్‌తో లుక్ టెస్ట్‌లు పూర్తి చేశారు.

Also Read: Ravi Teja: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణ్ శంకర్ – రవి తేజ సినిమా!

AA22 : విజువల్ ఎఫెక్ట్స్, థీమ్‌లు చూస్తే.. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే స్థాయిలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ లాంటి భారీ బ్యానర్ బ్యాకప్‌తో వస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రివీల్ కానున్నాయి. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినీ లవర్స్‌లో జోష్ నింపిన బన్నీ-అట్లీ కాంబో.. ఈ సినిమాతో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి మరి!

సిద్ధంగా ఉండండి AA22 : 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *