Hardik Pandya

Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కళ్లుచెదిరే ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబైకి అర్ష్‌దీప్ సింగ్..!

Hardik Pandya: ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కలలో కూడా ఊహించని సాలిడ్ షాక్ తగిలింది! క్రికెట్ సర్కిల్స్‌లో ఒకటే రచ్చ.. అసలు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో బిగ్గెస్ట్ ట్రేడ్ బాంబ్ పేలింది. గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఎంఐ ఫ్రాంచైజీ గుడ్‌బై చెప్పేసింది. తమ లీడ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఇచ్చి మరీ హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్ (PBKS) ఎగరేసుకుపోయింది. అటు ముంబైకి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ రాగా, ఇటు తొలి ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పంజాబ్‌కు హార్దిక్ రూపంలో ఒక పవర్‌ఫుల్ మ్యాచ్ విన్నర్ దక్కాడు.

రూ. 18 కోట్ల స్వాప్ – అఫీషియల్ లెక్కలివే!

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం..
హార్దిక్ పాండ్యా రేట్ హైక్: ఇప్పటివరకు ముంబై నుంచి రూ. 16.35 కోట్ల ఫీజు తీసుకుంటున్న హార్దిక్‌కు పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించనుంది. అంటే అతని వేల్యూ మరింత పెరిగింది.
ముంబైలోకి అర్ష్‌దీప్: గత మెగా వేలంలో పంజాబ్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసిన టీమిండియా స్టార్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. అదే రూ. 18 కోట్ల ఫీజుతో ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌లో అడుగుపెడుతున్నాడు.
పంజాబ్ తరఫున ఇప్పటివరకు 96 మ్యాచులాడి 111 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను వదులుకోవడం ఆ జట్టుకు రిస్కే అయినా, తమ మిడిలార్డర్, కెప్టెన్సీ ప్రాబ్లమ్స్‌ను సెట్ చేసుకునేందుకు హార్దిక్‌ను తీసుకుంది.
ముంబైతో హార్దిక్ ఎమోషనల్ బాండ్.. ఆపై రోహిత్ స్థానంలో కెప్టెన్సీ..
2015లో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన హార్దిక్.. కెప్టెన్ రోహిత్ శర్మ గైడెన్స్‌లో అద్భుతంగా రాణించాడు. 2015, 2017, 2019, 2020లలో ముంబై టైటిల్స్ గెలవడంలో అతడిదే కీ రోల్.
ఆ తర్వాత 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లి తొలి సీజట్లోనే కప్పు కొట్టాడు, రెండో ఏడాది ఫైనల్ చేర్చాడు. దీంతో హార్దిక్‌ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ క్రేజ్‌తోనే 2024లో ముంబై యాజమాన్యం అతడిని భారీ ట్రేడ్ ద్వారా వెనక్కి తీసుకొచ్చి, ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చింది.
ట్రోలింగ్స్, బాటమ్ ప్లేస్, ఇంజూరీల నరకం!
అయితే, ముంబైలో హార్దిక్ సెకండ్ ఇన్నింగ్స్ ఒక పీడకలలా మారింది.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం డైజెస్ట్ చేసుకోలేని ఫ్యాన్స్.. స్టేడియంలో హార్దిక్‌ను ఘోరంగా బూ (Boo) చేస్తూ ట్రోల్ చేశారు. అది టీమ్ వాతావరణంపై దెబ్బకొట్టింది.
2024లో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున (10వ స్థానం) నిలిచింది. 2025లో కాస్త పుంజుకుని క్వాలిఫైయర్-2 దాకా వెళ్లినా, 2026 సీజన్‌లో మళ్లీ పేలవ ప్రదర్శనతో 9వ స్థానానికి పడిపోయింది. కెప్టెన్‌గా గత మూడు సీజన్లలో హార్దిక్ కేవలం 647 పరుగులు చేసి, 35 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
దీనికితోడు వెన్నునొప్పి (Back spasms), కాలి కండరాల పట్టేత (Leg strain), పిక్క గాయం (Shin injury) వంటి ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడాయి. దీంతో ముంబైకి ఒక స్ట్రాంగ్ పేస్ అటాక్ అవసరం పడటం, హార్దిక్‌తో పరిస్థితులు సెట్ కాకపోవడంతో వేరే ఆప్షన్ లేక అతడిని ట్రేడ్ చేయాల్సి వచ్చింది.
“థ్యాంక్యూ హార్దిక్”.. ముంబై ఎమోషనల్ ఫేర్‌వెల్..
డీల్ పూర్తయిన వెంటనే ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో హార్దిక్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.“జట్టు కోసం ఎంతో ఇష్టంతో, గర్వంతో పోరాడిన హార్దిక్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నీ కొత్త జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నాం” అంటూ ఒక ఎమోషనల్ వీడియోను పంచుకుంది. తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్‌లో 162 మ్యాచులాడి దాదాపు 146 స్ట్రైక్ రేట్‌తో 2,955 పరుగులు, 82 వికెట్లు తీసిన హార్దిక్.. ఇప్పుడు పంజాబ్ జెర్సీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *