Jr NTR

Jr NTR: స్టైలిష్ లుక్స్ లో మళ్ళీ అదరగొట్టేసిన NTR!

Jr NTR: టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన భారీ హిట్ చిత్రం ‘దేవర’ జపాన్‌లో రిలీజ్ కోసం తారక్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, తన లేటెస్ట్ స్టైలిష్ లుక్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తున్నారు.

జపాన్‌లో ఉన్నప్పటి నుంచి ఆయన చేస్తున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్లాక్ నెక్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో పాటు వైట్ డెనిమ్ షర్ట్‌లో ఎన్టీఆర్ డ్యాపర్ లుక్ అదిరిపోయింది. కూల్ అండ్ క్లాసీ స్టైల్‌తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఫోటోలు నందమూరి ఫ్యాన్స్‌లో జోష్ నింపుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Veeramallu: ‘వీరమల్లు’ మూడో సాంగ్ వచ్చేస్తోంది!

Jr NTR: ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జపాన్ నుంచి వస్తున్న ఈ స్టైలిష్ పిక్స్ చూస్తే.. తారక్ మరోసారి తన హవాను చాటినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *