Producer Death: తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చివరకు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. బుధవారం అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. దివంగత ఈవీవీ సత్యనారాయణకు సన్నిహిత బంధువైన ముళ్లపూడి.. ఆయన సాయంతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నిర్మాణ సంస్థ ద్వారా ‘నేను’, ‘అల్లుడుగారు వచ్చారు’, ‘మనోహరం’, ‘ఓ చిన్నదానా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు సినిమా సర్కిల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ముళ్లపూడి మరణ వార్త తెలియగానే సినీ ఇండస్ట్రీ షాక్లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు సంతాప సందేశాలతో ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి అపూర్వమైనదని.. ఆయన లేని లోటు తీరనిదని సన్నిహితులు వాపోతున్నారు. ముళ్లపూడి కుటుంబానికి సినీ తారలు, నిర్మాతలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
