AA 22

AA 22: అల్లు అర్జున్-అట్లీ కథపై క్రేజీ అప్డేట్!

AA 22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నాడు. తమిళ హిట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాలు కన్ఫార్మ్ చేశాయి. ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమా కథ పునర్జన్మల చుట్టూ తిరుగుతుందట. అందుకే అల్లు అర్జున్ ఈ మూవీలో డబుల్ రోల్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’, ‘మనం’ లాంటి సినిమాల స్టైల్‌లో ఈ చిత్రం ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయినట్లు సమాచారం.. త్వరలోనే అఫీషియల్‌గా లాంచ్ కానుందని టాలీవుడ్ టాక్. అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి తన నటనా సత్తా చూపించబోతున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అట్లీ మార్క్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ కథ, నేపథ్యం గురించి వార్తలు లీక్ అవుతూ సినీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *