Kalyan Ram: లేటెస్ట్ గా టీజర్ తో ఆకట్టుకున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటి విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ మొన్ననే వచ్చింది. అయితే ఈ టీజర్ సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. టీజర్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ రామ్ సినిమా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారట.ఇలా ఆంధ్రలో 12 కోట్లకి పైగా బిజినెస్ చేస్తే సీడెడ్ నుంచే 3.7 కోట్ల బిజినెస్ ఈ చిత్రం చేసిందట. అంతే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా ఈ సినిమాకి అమ్ముడుపోయాయట. ఇలా మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రం ఆల్ టైం రికార్డు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా ఈ వేసవిలో మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
