Jack Movie

Jack Movie: జాక్ కోసం పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్?

Jack Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా బీజీఎం నిలిచిందని చెప్పాలి. సామ్ సి.ఎస్ బీజీఎం వర్క్ అందించాడు. సామ్ సి.ఎస్ చేసిన మ్యూజిక్‌కు మంచి గుర్తింపు లభించింది.

Also Read: RC 16: జెట్ కంటే స్పీడ్ లో RC 16 షూటింగ్!

ఇక ఇప్పుడు మరోసారి తన బీజీఎం వర్క్‌తో ఆకట్టుకునేందుకు సామ్ సి.ఎస్ రెడీ అవుతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందిస్తున్నాడు.

Jack Movie: అయితే, ఈ సినిమాకు బీజీఎం అందించేందుకు సామ్ సి.ఎస్ తాజాగా జాయిన్ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘జాక్’లో ఛాన్స్ రావడంపై సామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ చిత్రానికి సామ్ ఎలాంటి బీజీఎం అందిస్తాడో చూడాలి. ఈ సినిమాని ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *