AAA 1st Convention: అమెరికాలో మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడానికి – తెలుగు సమాజాన్ని ఒక్కటి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) స్ఫూర్తిగా పనిచేస్తోంది. ‘మన తెలుగు భాషా సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, మన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి తెలుగువారి బాధ్యత’ అనే ఆలోచనలతో AAA, ఎన్నారై తెలుగువారిని ఒక్కటిగా చేర్చి, ముందుకు తీసుకెళ్తోంది.
అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ . . తెలుగు సంప్రదాయపు మాధుర్యాన్ని సుదూరతీరాల్లో కూడా మనసున పట్టి ఉంచేలా చేస్తోంది AAA. దసరా . . దీపావళి . . సంక్రాంతి పండగ ఏదైనా . .ఆగస్టు 15.. జనవరి 26 ఇలా మన దేశ ప్రత్యేకతను తెలిపే దినోత్సవాలు ఏవైనా వాటిని ఉత్సాహభరితంగా నిర్వహిస్తూ . . భారత దేశం . . అందులో తెలుగు ప్రజలు అనే స్ఫూర్తిని అందరిలో పెంచుతోంది AAA.
AAA 1st Convention: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొదటి నేషనల్ కన్వెన్షన్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది . ఈ నెల 29న AAA మొదటి నేషనల్ కన్వెన్షన్ వేడుకగా జరగనుంది . వెండి తెరపై తమ ప్రత్యేకతను చాటి చెప్పిన ప్రముఖ టాలీవుడ్ నటీనటులు . . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నిత్యం శ్రమిస్తున్న ప్రముఖ రాజకీయ నేతలు కార్యక్రమానికి మరింత వెలుగు తేనున్నారు . ఇక కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక గ్రాండ్ మ్యూజిక్ కన్సర్ట్ తో నెక్స్ట్ లెవెల్ లో ప్రోగ్రామ్ ప్రెజెంట్ చేయనున్నారు .
AAA 1st Convention: ఇక కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు ప్రత్యేకంగా హాజరై సందడి చేయనున్నారు. నటులు శ్రీకాంత్ , నిఖిల్ , సందీప్ కిషన్ , ఆది , తరుణ్ , సుశాంత్, విరాజ్ అశ్విన్ వేడుకలో పాల్గొనబోతున్నారు .సినీ నటులే కాదు . . ప్రముఖ తెలుగు రాజకీయనేతలు AAA మొదటి నేషనల్ కన్వెన్షన్ కు హాజరు కానున్నారు. అంతేకాదు నటీమణులు ఐశ్వర్య రాజేష్ , మెహరీన్ , ఆంకితకుమార్ , రుహానీ శర్మ , అమృతా అయ్యర్ , దక్షా నాగార్కర్ , కాయల్ ఆనంది , నువేక్ష , చంద్రికా రవి కార్యక్రమంలో మెరవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు, ఏపీ హోమ్ మినిష్టర్ వంగలపూడి అనిత, హెల్త్ మినిష్టర్ సత్యకుమార్ యాదవ్ , అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల AAA మొదటి మహాసభలో ప్రత్యేకంగా పాల్గొనబోతున్నారు.
AAA 1st Convention: ఇవన్నీ ఒక ఎత్తైతే.. అదేరోజు రాత్రి 8 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుని ప్రత్యేక కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు . అమెరికాలోని తెలుగు ప్రజలకు శ్రీ వేంకటేశుని కళ్యాణోత్సవ శోభను అందించే ఏర్పాటును AAA టీం చేస్తోంది . అలాగే కన్వెన్షన్ లో భాగంగా ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు . ఆహుతులను అలరించేలా . .సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. 50 రకాల వంటకాలతో విందు ఉంటుంది.
అమెరికాలోని తెలుగు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ప్రదీప్ బాలాజీ . . ఫోన్ నెంబర్ : +1 (603) 402-5374 అదేవిధంగా రవి చిక్కాల +1 (484) 280-4610, సత్య వెజ్జు +1 (690) 721-3495లను సంప్రదించవచ్చు .