Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళా మావోయిస్టులు కాల్చివేతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలోని మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్ర పోలీసుల యాంటీ-మావోయిస్ట్ హాక్ స్క్వాడ్, స్థానిక పోలీసు బృందాలు పాల్గొన్నాయని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విజయ్ థాపర్ తెలిపారు.
జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 90 కి.మీ దూరంలో ఉన్న ఒక ప్రదేశంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ సంఘటన శుభర్ అటవీ ప్రాంతంలోని రోండా అటవీ శిబిరం సమీపంలో జరిగింది. ఇందులో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరు తప్పించుకున్నారని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: PAK vs NZ: తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ ఘోర ఓటమి.. సెమీస్ ఆశలు క్లిష్టం
ఘటనా స్థలం నుండి తుపాకులు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్,303 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం పన్నెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయని ఆయన చెప్పారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై రాష్ట్ర పోలీసు దళాలను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రశంసించారు.
