ms dhoni

MS Dhoni: ఛాంపియన్స్ ట్రోఫీకి ధోనీ..! ఆటగాడిగా కాదండోయ్…!

MS Dhoni: వన్డే, టీ20 ప్రపంచ కప్ ల పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిపించిన ఏకైక టీమ్ ఇండియా కెప్టెన్ కూడా ధోనీ మాత్రమే. ఆ విషయానికి వస్తే… ప్రపంచంలోనే మూడు ప్రపంచ కప్ లు గెలిచిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. అయితే ఇప్పుడు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు, కానీ ఈసారి కెప్టెన్‌గా కాదు. మరి మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా,

2013లో ధోనీ నాయకత్వంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ ట్రోఫీని మళ్లీ గెలవడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభం కానుంది. రోహిత్ సేన ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయ్ వేదికగా జరుగనున్నాయి.

ఈ క్రమంలో, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో రూపొందించిన ప్రోమోను బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది, అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది. ఒక ఐసీసీ టోర్నీలో సాధారణంగా ఉండే పోటీ, ఒత్తిళ్ల పై ధోనీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా తాను ఎప్పుడూ కూల్‌గానే ఉండేవాడినని, కానీ ఇప్పుడు అభిమానిగా మ్యాచులు చూస్తూ ఉండడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. అందుకోసం డీఆర్ఎస్ అనగా ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ను సిద్ధం చేసుకోవడం కూడా సరిపోవడంలేదని వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: FIH Pro League 2024-25: హాకీ ప్రో లీగ్‌ కు భారత అమ్మాయిలు రెడీ..! మళ్లీ జట్టులోకి వచ్చిన వందన..!

MS Dhoni: ఇక ఈ ప్రోమోలో ధోనీ ఇలా మాట్లాడాడు. “నేను కెప్టెన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీని ఆడాను. మైదానంలో చాలా కూల్‌గానే నిర్ణయాలు తీసుకున్నాను. కానీ, అభిమానిగా ఈ ట్రోఫీని చూడటం నన్ను కూల్‌గా ఉంచడం లేదు. పోటీ చూస్తుంటే రసవత్తరంగా ఉంటుందనిపిస్తోంది. మన జట్టు బలంగా ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కోల్పోయినా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ టెన్షన్ నేపథ్యంలో, బయట మాత్రమే కాకుండా నా లోపలా కూడా ఉష్ణోగ్రత పెరిగిపోతోంది” అని ధోనీ వీడియోలో చెప్పాడు.

దీంతో ఐస్ గడ్డలతో తయారు చేసిన దుస్తులు, టోపీలను ధోనీ ధరించినట్లు చూపించారు. బయట నుంచి ఐస్ ట్యాంకర్లు తీసుకొచ్చి డంప్ చేసినా వేడి తగ్గడం లేదని ధోనీ ఇచ్చిన హావభావాలు ఆకట్టుకున్నాయి. మ్యాచుల ప్రభావంతో ఐస్ టాంకర్ల నుండి వచ్చే చలి కూడా సరిపోదని ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనగా డీఆరెస్ అవసరమని థర్డ్ అంపైర్‌కు సూచించినట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రోమో మొత్తం ఎంతో సరదాగా గడిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *