Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఓ చరిత్రాత్మక ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఒక గొప్ప రికార్డును నమోదు చేసాడు. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని దాటి ఈ ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ ఘనతను ఇప్పటికే ఎంతో మంది సాధించినా… వారందరికంటే తక్కువ మ్యాచ్ లలో స్మిత్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
శ్రీలంకతో గాలేలో జరిగిన మొదటి టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ (104 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించాడు. మ్యాచ్‌లో చేసిన మొదటి పరుగుతోనే అతను 10,000 పరుగుల మైలురాయిని దాటాడు.
భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనే ఈ రికార్డు సాధించాల్సి ఉంది కానీ, సిడ్నీ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. దాంతో 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 10,000 పరుగుల మైలురాయిని దాటి, 35వ టెస్ట్ శతకాన్ని కూడా సాధించాడు.
ఇది కూడా చదవండి: Congo Fever: వ్యాపిస్తున్న కొత్త వైరస్..ఒకరు మృతి..వ్యాక్సిన్ కూడా లేదు.. కాంగో జ్వరం అంటే ఏమిటి?
గతంలో ఆస్ట్రేలియా తరఫున 10,000 పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్‌ల సరసన స్మిత్ నిలిచాడు. టెస్ట్‌లో 10,000 పరుగులు చేసిన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడిగా, 15వ అంతర్జాతీయ ప్లేయర్‌గా నిలిచాడు. అంతే కాకుండా టెస్ట్‌లో 10,000 పరుగులు, వన్డేలో 5,000 పరుగులు, టీ20లో 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించి, అంతర్జాతీయ క్రికెట్లో 50 కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా స్టీవ్ స్మిత్ చరిత్రకెక్కాడు.
Steve Smith: తొలుత ఒక లెగ్ స్పిన్నర్ గా తన కెరీర్ ప్రస్థానం ప్రారంభించిన స్టీవెన్ స్మిత్ ఆ తర్వాత తనకు ఉన్న అత్యద్భుత బ్యాటింగ్ సామర్థ్యం గురించి తెలుసుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షైన్ వార్న్ స్ఫూర్తితో క్రికెట్ లోకి అడుగుపెట్టిన స్మిత్… క్రమంగా ప్రపంచంలోనే మేటి బ్యాటర్లలో ఒకడయ్యాడు. మధ్యలో సాండ్ పేపర్ వివాదంలో చిక్కుకొని అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధానికి గురైనా… మరలా తిరిగి వచ్చి మునుపటి శైలిలోనే రెచ్చిపోయాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ ప్రస్తావన వస్తే… స్టీవెన్ స్మిత్ పేరు ముందు వరుసలో ఉంటుంది.
