Shruti Haasan: కన్నవారిద్దరూ నటనలో రాణించిన వారే కాబట్టి శ్రుతి హాసన్ లోనూ యాక్టింగ్ జీన్స్ ఉన్నాయి. అందువల్ల శ్రుతి హాసన్ ను నటిగా మారకుండా ఏ శక్తీ అడ్డుకోలేక పోయింది. గ్లామర్ డాల్ గానే ఎక్కువగా కనిపించినా, కొన్ని చిత్రాల్లో నటనకూ ప్రాధాన్యమున్న పాత్రలు ధరించి అలరించారు శ్రుతి హాసన్. టాలీవుడ్ యంగ్ స్టార్స్ తో ఆమె సాగిన తీరు భలే జోరు చూపింది.
తన తండ్రి తరం హీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించీ అబ్బుర పరిచారు శ్రుతి. ఇలా ఎటు చూసినా ఆకర్షించడమే తెలిసిన శ్రుతి హాసన్ హొయలు చూసి అభిమానులు ఆనందంతో చిందులేస్తుంటారు. జనవరి 28న పుట్టినరోజు జరుపుకున్న శ్రుతిహాసన్ మరెన్నో విజయాలు సాధించాలని అభిమానులు శ్రేయోభిలాషులు ఆశించారు. మరి రాబోయే రోజుల్లో శ్రుతి హాసన్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Dhanush: ధనుష్ కేసులో నెట్ ఫ్లిక్స్ కు చుక్కెదురు
వీరయ్య’లోని సాంగ్…
