Hyderabad: హైదరాబాద్ మహానగరంలో భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున దాడులు చేయడంతో ఈ వ్యభిచార కూపం బయటపడింది. విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న బాగోతం వెల్లడైంది. గత కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో ఓ యువకుడు వ్యభిచారం చేయిస్తున్నట్టు తెలిసి.. ఆ వ్యభిచార గృహంపై మాధాపూర్ ఎస్‌వోటీ, హెచ్‌టీఎఫ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad: కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు తప్పించుకొని పారిపోవడంతో అతని కోసం మాధాపూర్ పోలీసులు వెతుకుతున్నారు.