Rajendra Prasad Daughter: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు . నిన్న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అంటే అక్టోబర్ 5 ఉదయం ఆమె మృతి చెందారు. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు .
Also Read: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..
గాయత్రికి ఒక కొడుకు , కూతురు ఉన్నారు . చిన్నవయసులోనే గాయత్రి మరణాన్ని రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇంట జరిగిన ఈ విషాదం తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయనను పరామర్సించడానికి వెళుతున్నారు.
