Konda surekha: కౌశిక్ రెడ్డి పిచ్చోడు.. కేటీఆర్ పెట్రేగితే ఊరుకోము…

Konda surekha: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదని వాడో పిచ్చోడంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని అన్నారు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టి డాన్సులు చేసే సంస్కృతి ఇంతకుముందు అసెంబ్లీలో లేకుండే అన్నారు. మెదడు లేకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నారని కేటీఆర్ పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు. మీరు పెట్రేగి పోతే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ తల్లి నీ కేటీఆర్ దొరసాని లెక్క చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత లెక్క వడ్డాణం.. దొరసాని లాగ పెట్టుకున్నారన్నారు. మేము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నాం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని వారందరినీ ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నాడు కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక.. ఇప్పుడు మేము ఏం చేసినా ఉద్యమాలు చేస్తామనీ అంటున్నారని అన్నారు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

మీరు దోచుకుని.. మీ కుటుంబం బాగు పడిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మీలాగా రేవంత్ అనుకుంటున్నారు.. మీలాగా కాదు మేము అన్నారు. కేటీఆర్ ఎక్కడ పోయినా వెళ్లగొడుతున్నారని కొండా సురేఖ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *