Sai Dharam Tej

Sai Dharam Tej: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్‌మెంట్..?

Sai Dharam Tej: మెగా కాంపౌండ్‌లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ఇంకా ధ్రువీకరించనప్పటికీ, పెళ్లి పనులు మాత్రం జోరుగా సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది.

ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు మెగా కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తాన్ని అధికారికంగా ఖరారు చేయనుండగా, డిసెంబర్ నెలలోనే పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. నిశ్చితార్థ వేడుక ముగిసిన వెంటనే సాయి ధరమ్ తేజ్ స్వయంగా తన వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటనను అభిమానులతో పంచుకోనున్నారు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధం (అరేంజ్డ్ మ్యారేజ్) కాగా, వధువు వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *