Samantha

Samantha: 9వ నెలలోనూ తగ్గని జోరు.. జిమ్‌లో సమంత భారీ వర్కౌట్స్

Samantha: ప్రెగ్నెన్సీ చివరి దశకు చేరిందంటే చాలామంది పూర్తిగా విశ్రాంతికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గర్భం దాల్చిన తొమ్మిదో నెలలోనూ ఏమాత్రం అలసట లేకుండా జిమ్‌లో బరువులు ఎత్తుతూ చెమటోడుస్తోంది. ఫిట్‌నెస్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సామ్.. తన ప్రెగ్నెన్సీ జర్నీ మొదలైన నాటి నుంచి తొమ్మిదో నెల వరకు సాగిన వర్కౌట్ ప్రయాణాన్ని ఒకే వీడియోగా చేసి  సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

#9. ది ఫైనల్ ల్యాప్’.. వెయిటెడ్ స్క్వాట్లతో అదరగొట్టిన సామ్!

సమంత షేర్ చేసిన వీడియోలో ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచి ఇప్పటివరకు ఆమె శరీరం మారుతున్న తీరు, దానికి తగినట్లుగా ఆమె చేసిన వ్యాయామాలు కనిపించాయి. డెలివరీకి దగ్గరపడుతున్న ఈ 9వ నెలలోనూ ఏమాత్రం తడబడకుండా చేతిలో డంబెల్ పట్టుకుని ఛాతీకి ఆనించి బరువులు ఎత్తుతూ స్క్వాట్స్ చేస్తూ కనిపించింది.

ఈ స్పెషల్ వీడియోకు ‘#9. ది ఫైనల్ ల్యాప్’ (ఆఖరి అంకం) అంటూ క్యాప్షన్ ఇచ్చి, తాను ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది.

గతంలోనూ తన ప్రీ-నాటల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషన్ గురించి మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో ట్రైనింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది.. కష్టపడి చేయడం కంటే మన శరీరం ఏం చెబుతోందో వినడమే ముఖ్యం” అని సమంత పేర్కొంది.

“సూపర్ మామ్” అంటూ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ప్రశంసలు

తొమ్మిదో నెలలోనూ ఇంతటి డెడికేషన్‌తో వర్కౌట్స్ చేయడం చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ ఇన్‌స్పిరేషన్.. సూపర్ మామ్ అంటూ కామెంట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోయిన్ కృతి కర్బందా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. మీ ముగ్గురికీ నా ప్రేమాభిమానాలు!  అంటూ హార్ట్ ఎమోజీలతో ప్రేమను కురిపించింది.

రాజ్ నిడిమోరుతో వివాహం.. త్వరలోనే తల్లిదండ్రులుగా!

దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత గత డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌ పరిధిలోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దివారాల క్రితం కూడా ఈ జంట కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలను జరుపుకున్నారు. ఇప్పుడు తమ తొలి సంతానాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో సమంత షేర్ చేసిన ఫిట్‌నెస్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *